కలర్‌ఫుల్‌ రైస్‌

- June 26, 2017 , by Maagulf
కలర్‌ఫుల్‌ రైస్‌

కావలసిన పదార్థాలు: బ్రౌన్‌ బాసుమతి రైస్‌ - 1 కప్పు, నీరు - ఒకటిన్నర కప్పు, క్యారెట్‌, ఉల్లికాడ, గ్రీన్‌ క్యాప్సికం, రెడ్‌ క్యాప్సికం, కొత్తిమీర తరుగు - అరకప్పు చొప్పున, ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత, నువ్వుల నూనె - 1 టేబుల్‌ స్పూను. 
తయారుచేసే విధానం: రైస్‌ను కడిగి, 30 నిమిషాలు నానబెట్టి, పొడిగా వండి ఆరబెట్టాలి. నూనెలో ఉల్లికాడలు, క్యారెట్‌, రెడ్‌ క్యాప్సికం, గ్రీన్‌ క్యాప్సికం, కొత్తిమీర తరుగు రెండేసి నిమిషాల తేడాతో ఒకటి తర్వాత ఒకటి వేస్తూ వేగించాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాలపొడితో పాటు రైస్‌ వేసి 2 నిమిషాలు కలిపి వేడివేడిగా తినాలి. ఈ కలర్‌పుల్‌ రైస్‌ని పిల్లలు ఎంతో ఇష్టపడతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com