నెదర్లాండ్స్ బయల్దేరిన నరేంద్రమోదీ
- June 26, 2017
రెండు రోజుల అమెరికా పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్కడి నుంచి నెదర్లాండ్స్ బయల్దేరారు. నెదర్లాండ్స్లో ఆ దేశ ప్రధాని మార్క్ రట్టేతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాద సంబంధిత అంశాలపై ఇరు నేతలు చర్చించనున్నారు. పర్యటనలో భాగంగా.. డచ్ కంపెనీ సీఈవోలతో కూడా ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. నెదర్లాండ్స్ రాజు విల్లెమ్ అలెగ్జాండర్, రాణి మాక్సిమాను కూడా మోదీ కలవనున్నారు. ఆ తర్వాత పర్యటన ముగించుకుని భారత్ తిరుగు ప్రయాణమవుతారు.
మూడు దేశాల పర్యటనలో భాగంగా ఈ నెల 24న మోదీ పోర్చుగల్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి అమెరికా వెళ్లిన మోదీ రెండు రోజుల పాటు అగ్రరాజ్యంలో పర్యటించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో తొలిసారిగా భేటీ అయ్యారు. అమెరికా పర్యటనలో మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా సీఈవోల సదస్సులో పాల్గొన్నారు.
భారత-అమెరికన్ విందులోనూ మోదీ ప్రసంగించారు.
తాజా వార్తలు
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్‌వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్‌కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్









