శ్రీదేవి రిలీజ్ లోపు ఇంకెన్ని సంచలనాలు??
- October 15, 2015
విలన్ గా పరిచయం అయి, తరువాత హీరోగా మారి, ఆపై దర్శకుడిగా మారిన సౌత్ స్టార్ జెడి చక్రవర్తి. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా అదే మాటతీరును ప్రదర్శించే జెడి చక్రవర్తి, ఓ వివాదాస్పద సినిమాను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడట. గతంలో 'సావిత్రి' పేరుతో ఓ ఎరోటిక్ సినిమాను ఎనౌన్స్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. తన టీచర్ మీద మనసుపడే అబ్బాయి కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా పోస్టర్లతోనే క్లియర్ చేశాడు వర్మ. అయితే వర్మ విడుదల చేసిన పోస్టర్స్ తో పాటు, సినిమాకు పెట్టిన 'సావిత్రి' అనే టైటిల్ అప్పట్లో పెద్ద దుమారం లేపింది. దీంతో కాస్త వెనక్కి తగ్గిన వర్మ సినిమా టైటిల్ ను 'శ్రీదేవి'గా మార్చాడు. చాలా కాలంగా శ్రీదేవి సినిమా విషయంలో ఎలాంటి అప్ డేట్ ఇవ్వని వర్మ టీం... తాజాగా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు రావాలని ఆలోచిస్తుందట. వర్మ శిష్యుడైన జెడి చక్రవర్తి దర్శకత్వంలో ఈ సినిమాను పూర్తి చేసి వీలైనంత త్వరగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సెట్స్ మీదకు రాకుండానే వివాదాలు సృష్టించిన శ్రీదేవి రిలీజ్ లోపు ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







