సముద్రంలో గల్లంతయిన వ్యక్తి మృతదేహం వెలికితీత

- June 28, 2017 , by Maagulf
సముద్రంలో గల్లంతయిన వ్యక్తి మృతదేహం వెలికితీత

ఈత సరదా ఓ వ్యక్తి ప్రాణాల్ని తీసేసింది. సముద్రంలో ఈతకు వెళ్ళిన ఓ వ్యక్తి, ఈత కొడుతూ సముద్రంలో గల్లంతయ్యాడు. అతని మృతదేహాన్ని కనుగొనేందుకు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. తీర ప్రాంతమంతటా గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు, ఎట్టకేలకు అతని మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ విషయాన్ని హమాద్‌ మెడికల్‌ కార్పొరేషన్‌ వర్గాలు వెల్లడించాయి. మృతుడ్ని ఈజిప్టుకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కమ్యూనిటీ మెంబర్స్‌, సముద్రంలో ఓ వ్యక్తి గల్లంతయినట్లు సోషల్‌ మీడియాలో ఆ వ్యక్తి ఫొటోల్ని పోస్ట్‌ చేశారు. ఈద్‌ తొలి రోజున సముద్రంలో ఈత కొట్టాలన్న సరదా ఆ వ్యక్తి మరణానికి కారణమయ్యింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com