కిదాంబి శ్రీకాంత్ ను సన్మానించిన సీఏం చంద్ర బాబు

- June 28, 2017 , by Maagulf
కిదాంబి శ్రీకాంత్ ను సన్మానించిన సీఏం చంద్ర బాబు

అస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీష్ బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచిన కిదాంబి శ్రీకాంత్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. వరుసగా రెండు టైటిల్స్ ను సాధించిన శ్రీకాంత్ కు వెయ్యి గజాల స్థలం రూ.50 లక్షల నగదును ఇవ్వనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. గ్రూప్1 ఉద్యోగం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.

కోచ్ పుల్లెల గోపిచంద్ కు రూ. 15 లక్షల బహుమతిని ఇవ్వనున్నట్టు ప్రకటించారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శ్రీకాంత్ ను ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి బుదవారం నాడు సన్మానించారు. షటిల్ బ్యాట్ ను సీఏం కు శ్రీకాంత్ బహుమతిగా అందించారు. శ్రీకాంత్ తో చంద్రబాబునాయుడు సరదాగా షటిల్ ఆడారు. ఏపీ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన క్రీడాకారుడు అంటూ శ్రీకాంత్ ను ఆయన అభినందించారు. శ్రీకాంత్ ఇక ఏపీ తరుపున ఆడతారని చెప్పారు. విదేశీ కోచ్ ను పెట్టుకొనేందుకు కూడ అతడికి సహయం అందిస్తామన్నారు. అమరావతిలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనునన్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమం లో యువజన క్రీడా మంత్రి కొల్లు రవీంద్ర కూడా పాల్గొన్నారు​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com