ఓ బామ్మ నాణాలు.. విమానం ఇంజన్‌లో విసిరేసింది

- June 29, 2017 , by Maagulf
ఓ బామ్మ నాణాలు.. విమానం ఇంజన్‌లో విసిరేసింది

ఓ బామ్మ కారణంగా కాసేపట్లో బయలుదేరాల్సిన విమానం ఎయిర్‌పోర్టులో హఠాత్తుగా ఆపేశారు. విమానం ఇంజన్‌ను ఓపెన్ చేసి మరమ్మత్తు చేసినంత పనిచేశారు. దీంతో కొన్నిగంటలు ఆలస్యంగా ఆ విమానం బయల్దేరాల్సివచ్చింది. ఇంతకీ ఆ బామ్మ చేసిన పని ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే!
షాంఘై పుడోంగ్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి చైనా విమానం సీజెడ్‌ 380 గాంగ్జౌ సిటీకి బయలుదేరేందుకు రెడీగా వుంది. ఈలోగా గాంగ్జౌకి వెళ్లేందుకు 80 ఏళ్ల బామ్మ ఆమె భర్త, కూతురు, అల్లుడుతో కలిసి విమానం ఎక్కుతోంది. ఐతే, ఈ బామ్మకు అతీతశక్తుల మీద నమ్మకం ఎక్కువగా వుండడంతో తమకు ఎలాంటి హానీ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో తన వద్దనున్న తొమ్మిది నాణాలను విమానం ఇంజన్‌లోకి విసిరేసింది. అది గమనించిన ఓ ట్రావెలర్ సిబ్బందికి చెప్పగా విమానాన్ని ఆపేశారు. అప్పటికే ఎక్కి కూర్చున్న 150 మందిని ప్రయాణికులను దింపేశారు. తొలుత ఇంజిన్‌ భాగంలో వెతగ్గా ఎనిమిది నాణాలు దొరికాయి. మరోనాణెం దొరక్కపోవడంతో ఇంజన్‌ భాగాన్ని విడదీసి చూడగా అందులో ఇరుక్కుపోయింది. చివరకు నాణాన్ని తొలగించి విమానాన్ని సిద్ధం చేసి పంపించారు. చివరకు బామ్మని, ఫ్యామిలీ సభ్యులను చైనా పోలీసులు విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com