బ్రేకింగ్ న్యూస్ యాప్ ని ప్రారంభించనున్న ఫేస్బుక్

- October 15, 2015 , by Maagulf
బ్రేకింగ్ న్యూస్ యాప్ ని ప్రారంభించనున్న ఫేస్బుక్

 ఏదైనా కొత్త విషయం బ్రేక్ అవగానే మీరు మీ స్మార్ట్ ఫోన్లో వేసుకున్న న్యూస్ యాప్ ల నుంచి నోటిఫికేషన్లు వస్తాయి కదూ. వీటికి వస్తున్న ఆదరణ చూసి ఫేస్ బుక్ కూడా ఈ తరహా బ్రేకింగ్ న్యూస్ యాప్ ను ప్రారంభించనుంది. ఇది అక్టోబర్ నెలాఖరుకల్లా ప్రారంభం కావచ్చు. ఈ యాప్ వేసుకున్న యూజర్లు తమకు నచ్చిన కంటెంటుకు సంబంధించిన రియల్ టైమ్ నోటిఫికేషన్లు పొందవచ్చు. అయితే ఫేస్ బుక్ నేరుగా ఈ యాప్ నోటిఫికేషన్లు ఇవ్వదు. వివిధ ప్రచురణ సంస్థలు ఫేస్ బుక్ తరఫున ఈ మొబైల్ నోటిఫికేషన్లు ఇస్తాయి. ఇవి ట్వీట్ల కంటే కొంచెం ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు. ఆ నోటిఫికేషన్ ను టచ్ చేస్తే దాని ద్వారా సంబంధిత ప్రచురణ సంస్థ వెబ్ సైట్ కు యూజర్లు రీడైరెక్ట్ అవుతారు. ఇన్నాళ్లూ కేవలం సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫారంగానే ఉన్న ఫేస్ బుక్.. తన పరిధిని మరింత విస్తృతం చేసుకోవాలని చూస్తోంది. అందుకోసమే ఈ బ్రేకింగ్ న్యూస్ నోటిఫికేషన్లు ఇవ్వడం మొదలుపెట్టనుంది. దీనివల్ల ఫేస్ బుక్ ఒక మల్టీ ఫంక్షనింగ్ ప్లాట్ ఫారంగా మారుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ వార్తాసంస్థలకు సంబంధించిన న్యూస్ యాప్ లు ఉన్నా.. వాటిలో వేటికీ ఫేస్ బుక్ కు ఉన్నంత ప్రపంచవ్యాప్త విస్తృతి లేదని, అందుకే వాటికి కావల్సిన విస్తృతి కల్పించడం, అదే సమయంలో తమ ప్రాముఖ్యాన్ని కూడా పెంచుకోవడం అనే రెండు లక్ష్యాలపై ఫేస్ బుక్ గురిపెట్టిందని విశ్లేషకులు అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com