అదుపు

- October 15, 2015 , by Maagulf

 

అదుపు 

పదహారవ ప్రాయంలోనే సుడి గాలిలా 
ప్రవేశించి
పొగ మేఘమై గుండెను ఉక్కిరి బిక్కిరి 
చేసింది
మొదటి ప్రేమో ఆకర్షణనో లేక సినీ తారా 
మాయా జాలమో
లాగి వదిలిన శరాఘాతాల్లా రింగు రింగుల్లా
కలలు కలలుగా పై పైకి
లేని ప్రేయసి ఎలాగూ రాలేదు తననూ 
వెనక్కి వెళ్ళమని కోరాను ససేమిరా అంది,
ఇష్ట పడి కట్టుకుని కలిసి వచ్చిన అర్ధాంగి అర్ధంతరంగా
అన్యాయం అవుతాననేమోనని చెవుల ఇల్లు కట్టుకుని పోరు..
ఇక తప్పలేదు పో పొమ్మని కసరక కానీ
తను కాస్త కూడా కదలకుండా ఉంటుానే మరింత 
నా ఊపిరిని తనకు బానిసను చేసింది
ఛి ఛి అన్నాను నువ్వొక వ్యసనమన్నాను
నన్ను నేనే అసహ్యించుకున్నాను
ఆలస్యంగా తెలుసుకున్నాను సరదా మోజుతో 
దాని చేతిలో మోసపోయానని
చాలా యుద్ధం చేసాను మనసును అదుపు 
చేసుకున్నాను
అర కొర వయసులోనే గతి తప్పిన నన్ను 
నిలవరించుకున్నాను
విజయున్ని నేనయ్యాను అయితే
నా స్వఛ్చమైన శ్వాసకిప్పుడు అయిదేళ్ళు


-- జయరెడ్డి బోడ

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com