అబుదాబి రెసిడెంట్ విశాలకోసం ఆన్లైన్ లో దరఖాస్తులు

- July 01, 2017 , by Maagulf
అబుదాబి రెసిడెంట్ విశాలకోసం ఆన్లైన్ లో దరఖాస్తులు

అబుదాబి: ఎమిరేట్లో ఉన్న అబుదాబి నివాసితులు కొత్త వీసాను పొందడం లేదా వీసా పునరుద్ధరణలకు కోసం ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని శనివారం ఇంటీరియర్ మంత్రిత్వశాఖ రెసిడెన్సీ,విదేశీ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ ఒక ప్రకటనలో తెలిపింది.https: //echannels.moi.gov.ae సందర్శించడం ద్వారా నివాసితులు ఇకపై సులువుగా వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.పోర్టల్ దరఖాస్తు మరియు పునరుద్ధరణ ప్రక్రియ భారాన్ని తగ్గించడానికి మరియు ప్రధాన కార్యాలయం చుట్టూ తిరగడం  లేదా టైపింగ్ కేంద్రాలను పదే పదే సందర్శించే పరిస్థితుల నుండి నివాసితుల ఇబ్బందుల నుండి గట్టెక్కిస్తుందని డైరెక్టర్ డైరెక్టరేట్ వద్ద రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ యొక్క జనరల్  బ్రిగేడియర్ మన్సూర్ ఆల్ దహేరి తెలిపారు ఆన్లైన్ దరఖాస్తును ఈ పోర్టల్ లో సమర్పించడానికి, నివాసితులు ఇందుకోసం వివిధ దశలలో అవసరమైన పత్రాలను స్కాన్ చేయించాల్సి ఉంది. దరఖాస్తు ఆమోదించబడిన తరువాత మరియు అన్ని దశలను పూర్తి చేసిన తర్వాత, వారి పాస్పోర్ట్ లపై స్టాంప్ ముద్రించుకొన్న తర్వాత కేవలం వీసాను  పొందేందుకు ప్రధాన కార్యాలయాన్ని ఒకసారి వారు సందర్శించాల్సిన అవసరం ఉంది. డైరెక్టరేట్ యొక్క టైపింగ్ కేంద్రాలు మరియు ప్రధాన కార్యాలయాలు సేవలు అందించడానికి ఎప్పటి మాదిరిగానే యధావిధంగానే కొనసాగుతాయని బ్రిడ్జియెర్ అల్ దహేరి చెప్పారు. ఆన్లైన్ పోర్టల్ లో వీసాలు కోసం లావాదేవీలను అత్యధికులు జరపడం ద్వారా ఆ విధాన ప్రక్రియ సులువుగా చేసే లక్ష్యంతో ఏర్పాటైంది. వీసాలను ఆన్లైన్ లో నమోదు చేసుకున్న వారు రిజిస్టర్డ్  టైపింగ్ కేంద్రాల వద్ద ఆ జాబితాను www.adnrd.gov.ae లో చూడవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com