ఎన్టీఆర్ బయోపిక్..బాలకృష్ణ హీరోగా వర్మ సినిమా

- July 04, 2017 , by Maagulf
ఎన్టీఆర్ బయోపిక్..బాలకృష్ణ హీరోగా వర్మ సినిమా

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరో సెన్సేషన్‌ క్రియేట్‌ చేయబోతున్నారు. ఈ సారి ఏకంగా ఆయన ఎన్టీఆర్‌ జీవితంపై సినిమా తీయబోతున్నట్టు  ప్రకటించారు. ఈ సినిమాలో హీరోగా బాలకృష్ణ  నటించబోతున్నరట. ఎన్టీఆర్‌ జీవితానికి సంబంధించి ఎవరికీ తెలియని అంశాలతో పాటు.. కాంట్రవర్సీల వెనుక అసలు కాంట్రవర్సీని సినిమాలో చూపిస్తానంటున్నాడు వర్మ. సినిమాకు సంబంధించిన ఒక సాంగ్ ను కూడా రిలీజ్ చేశాడు.
ఎన్టీఆర్‌ జీవితంపై సినిమా. అదీ రామ్‌ గోపాల్‌ వర్మ తీస్తున్నాడంటేనే ఎన్నో అంచనాలు. దీంతో..సినిమాలో వర్మ ఏం చూపించబోతున్నాడనేదానిపై డిస్కషన్లు స్టార్ట్‌ చేశారు. సినిమాలు, రాజకీయాలు, పర్సనల్‌ లైఫ్‌తో పాటు ఆయన జీవితంలో జరిగిన సంఘటనలను వర్మ ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి. బయోపిక్స్ తీయడంలో వర్మను మించిన వాళ్లు తెలుగు ఇండస్ట్రీలో లేరనే చెప్పాలి. గతంలో పరిటాల రవిపై రక్తచరిత్రను, బెజవాడ రాజకీయాలపై వంగవీటి సినిమాలు తీశాడు. అయితే,. వీటన్నిటికి భీన్నంగా ఎన్టీఆర్ బయో పిక్ ఉంటుందని చెప్తున్నాడు వర్మ. అయితే, అందులో అన్నీ వాస్తవాలే చూపిస్తాడా లేక మిగతా బయోపిక్స్ లానే కల్పిత కథలను జోడిస్తాడా అనేది మరికొద్దిరోజుల్లోనే తేలిపోతుంది.
తెలుగులో మళ్లీ సినిమా తీయనని వంగవీటి తర్వాత ప్రకటించిన వర్మ.. ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ పై సినిమా ప్రకటించడంతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com