ధనుష్ నటించిన VIP - 3 మరియు 4 గా మనముందుకు రాబోతుంది
- July 09, 2017
కలైపులి ఎస్.థాను నిర్మాణంలోని వి.క్రియేషన్స్, ధనుష్ నిర్మాణంలోని వండర్‌బార్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'వీఐపీ 2'. ఈ చిత్రానికి రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించారు. గతంలో వేల్రాజ్ దర్శకత్వంలో విడుదలైన 'వీఐపీ'కి కొనసాగింపు చిత్రమిది. ఈ రెండో భాగంలోనూ ధనుష్‌కు జోడీగా అమలాపాల్ నటించారు. ధనుష్ తండ్రిగా సముద్రకని పాత్ర కూడా కొనసాగుతోంది. బాలీవుడ్ నటి కాజోల్ ఇందులో కీలకపాత్ర పోషిస్తుండటం విశేషం. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పాటలను, ట్రైలర్‌ను ముంబయిలో విడుదల చేశారు. ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు 8 మిలియన్ల ప్రేక్షకులు చూశారు. ఈ నేపథ్యంలో చెన్నైలో ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో ధనుష్, కాజోల్, అమలాపాల్, సముద్రకని, నిర్మాత థాను, దర్శకురాలు సౌందర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ వీఐపీ, వీఐపీ 2 చిత్రం హీరో, హీరోయిన్ ప్రాధాన్యత కలిగిన సినిమాలు కాదు. అమ్మ సెంటిమెంట్‌తో రూపొందించినవే.
ఈ కథను రెండో భాగంతో ముగించలేం. తప్పకుండా 3, 4 భాగాలు కూడా వస్తాయి. తొలి భాగంతో పోల్చితే రెండో భాగం మరింత భిన్నమైన సినిమా కావడంతో సంగీత దర్శకుడిగా షాన్ రోల్డన్‌ను ఎంచుకున్నాం. జులై 28వ తేదీన నా పుట్టిన రోజు సందర్భంగా చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు.
సౌందర్య మాట్లాడుతూ ధనుష్ నా కన్నా సీనియర్. ఆయనతో పనిచేస్తున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నా. ఈ సినిమాలో నటించడానికి అంగీకరించి.. మేం అనుకున్నదానికన్నా పెద్ద స్థాయికి తీసుకెళ్లిన కాజోల్ మేడంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
కాజోల్ ప్రసంగిస్తూ '20 ఏళ్ల తర్వాత మళ్లీ తమిళంలో నటించడం ఆనందంగా ఉంది. అవకాశం కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు. నేటి సినిమా కేవలం ఏదో ఒక భాష ప్రేక్షకులకు మాత్రమే పరిమితం కావడం లేదు. సినీ పరిశ్రమ ఇప్పుడు కొత్త దిశగా ప్రయాణం చేస్తోంది' అని అన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







