నాగపూర్ బోటుషికారులో వీడియో.. కాసేపటికే గల్లంతు

- July 10, 2017 , by Maagulf
నాగపూర్ బోటుషికారులో వీడియో.. కాసేపటికే గల్లంతు

మహారాష్ట్రలోని నాగ్పూర్లో విషాదం చోటుచేసుకుంది. పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా విహారయాత్రకు వెళ్లిన కొందరు యువకులు ప్రమాదంలో చిక్కుకున్నారు. కలమేశ్వర్ ప్రాంతంలోని వేనా డ్యాంలో వారు ప్రయాణిస్తున్న బోటు ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ఏడుగురు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే..
నాగ్పూర్కు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు.. ఆదివారం వేనా డ్యామ్కు వెళ్లారు. సాయంత్రం సమయంలో ముగ్గురు బోట్ సిబ్బందితో కలిసి రైడింగ్ చేశారు. బోట్లో షికారు చేస్తున్న సమయంలో వారంతా సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అందులోని వ్యక్తి ఆ వీడియోను ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే వారు ప్రయాణిస్తున్న బోటు ప్రమాదవశాత్తు ముగినిపోయింది. గమనించిన స్థానికులు ఇద్దరు బోట్ సిబ్బంది, ఒక విద్యార్థిని రక్షించారు.సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఒక మృతదేహాన్ని గుర్తించగా.. మరో ఏడుగురు గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం నుంచి గజ ఈతగాళ్లతో కూడిన రెండు బృందాలు ఇక్కడ గాలింపు చేపట్టాయని నాగ్పూర్ రూరల్ అదనపు ఎస్పీ సురేశ్ భోయత్ తెలిపారు. అయితే పడవ ఎలా మునిగిపోయిందో ఇంకా స్పష్టత రాలేదన్నారు. బోట్లో వారంతా పుట్టినరోజు వేడుకలు చేసుకున్నట్లు తెలుస్తోంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com