జూనియర్ ఎన్టీఆర్‌కు అవార్డు అందించిన 'సైమా'
- July 10, 2017
'యంగ్‌టైగర్' ఎన్టీఆర్ గత ఏడాది 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజీ' చిత్రాల ద్వారా మంచి విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లోని ఆయన నటనకు అటు ప్రేక్షకులే కాదు ఇటు విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురింపించారు. దీంతోపాటు 2016కు గానూ తారక్ పలు అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. ఇటీవల అబుదాబిలో అంగరంగ వైభవంగా జరిగిన సైమా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో 'జనతాగ్యారేజీ' చిత్రంలో నటనకు ఎన్టీఆర్‌కు ఉత్తమ నటుడి అవార్డు ప్రకటించారు. అయితే ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఆ వేదికపై అవార్డు అందుకోలేకపోయారు. తాజాగా సైమా ఛైర్పర్సన్ బృందా ప్రసాద్ ఇవాళ ఎన్టీఆర్‌కు స్వయంగా అవార్డును అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సైమా తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం 'జైలవకుశ' షూటింగ్లో బిజీగా ఉన్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయన త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల ఇందులోని 'జై' పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్ రికార్డు స్థాయిలో వీక్షణలు దక్కించుకుంది. రాశీఖన్నా, నివేతా థామస్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం







