అమరవీరుల కుటుంబాలకు జెడ్డా కమ్యూనిటీ ప్రగాఢ సానుభూతి
- July 10, 2017
జెడ్డా: డిప్యూటీ ప్రీమియర్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సమక్షంలో జెడ్డా కమ్యూనిటీ సర్వీసెస్, అమరవీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపాయి. జెడ్డాలో సౌదీ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మరియు అమరవీరులకు ఈ సందర్భంగా ఘన నివాళులర్పించారు. సుప్రీం కమిటీ ఆఫ్ ప్రైడ్ అండ్ హానర్ ఫర్ మార్టీర్స్ ప్రిన్స్ బందర్ బిన్ నాజర్, వెస్టర్న్ రీజియన్ ఆర్మీ కమాండర్ మేజర్ జనరల్ సాద్ అల్ కార్ని, ఆర్మీ, నావీ, సౌదీ అరామ్‌కో అధికారులు, 2,000 మంది అమరవీరుల కుటుంబాలకు చెందినవారు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ప్రిన్స్ బందర్ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులర్పించేందుకు, అలాగే తమవారిని కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు ఇదొక గొప్ప గౌరవం అని అన్నారు. తాము చేసింది చిన్న ప్రయత్నం మాత్రమేనని ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ ఫహద్ అల్ సమ్హాన్ చెప్పారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







