ఇంటికి నిప్పు: నిందితుడికి మూడేళ్ళ జైలు
- July 12, 2017
ఓ మహిళ ఇంటిని, కారుని తగలబెట్టిన కేసులో ఓ వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అగ్ని ప్రమాదం కారణంగా 2000 బహ్రెయినీ దినార్స్ నష్టం వాటిల్లింది. 20 ఏళ్ళ బహ్రెయినీ వ్యక్తి, బాధితురాలి ఇంట్లోని పెట్ బర్డ్స్ని దొంగిలించే క్రమంలో విఫలమై, అసహనంతో ఆ ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో నిందితుడికి మరో వ్యక్తి కూడా సహకరించాడు. అయితే ఆ వ్యక్తి ఎవరన్నదీ తెలియరాలేదు. ఘటన జరిగిన సమయంలో బాధితురాలు ఇంట్లో లేరు. పక్షుల్ని దొంగిలించేందుకోసం ఫెన్సింగ్ ద్వారా ఇంట్లోకి ప్రవేశించామనీ, అయితే అక్కడ కేజ్లో పక్షులేమీ లేకపోవడంతో నిప్పు పెట్టాననీ, వెళుతూ వెళుతూ సీసీటీవీ కెమెరాని ధ్వంసం చేశామని నిందితుడు పేర్కొన్నాడు. నిందితుడిపై గతంలో 31 కేసులున్నాయి. ఆ కేసుల్లో 20 ఏళ్ళ జైలు శిక్ష కూడా పడింది నిందితుడికి.
తాజా వార్తలు
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?







