వలస కార్మికుల కోసం కువైట్ సొసైటీ హాట్‌లైన్
- July 12, 2017
కువైట్: కువైట్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్, వలస కార్మికుల కోసం హాట్‌లైన్ 22215150ని ప్రారంభించింది. వలస కార్మికులకు కువైట్‌లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంలో భాగంగా లీగల్ రైట్స్ అలాగే డ్యూటీస్ విషయంలో అవగాహన కల్పించేందుకు ఈ హాట్‌లైన్ ఉపకరిస్తుందని కువైట్ సొసైటీ ప్రతినిథులు తెలిపారు. అరబిక్, ఇంగ్లీష్, ఫిలిప్పినో, హిందీ మరియు ఉర్దూ భాషల్లో ఈ హాట్‌లైన్ అందుబాటులో ఉంటుంది. లేబర్ చట్టాలు, మినిస్టీరియల్ డెసిషన్స్, అలాగే లీగల్ ప్రొసిడ్యూర్స్ వంటి వాటిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ హాట్‌లైన్‌ని ఏర్పాటు చేశారు. హాట్‌లైన్‌కి ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయి. వాటిల్లో పాస్‌పోర్ట్ రికవరీ, క్యాన్సిలేషన్, ట్రాన్స్పోర్ట్ వంటివాటితోపాటుగా ఫైనాన్షియల్ డ్యూస్ చెల్లింపు, ఫైనల్ క్యాన్సిలేషన్ ఆఫ్ ట్రావెల్ సహా పలు సమస్యలున్నాయి.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







