ఆగస్టు 15న మెగాస్టార్ చిరు బిగ్ హంగామా
- July 13, 2017
మెగాస్టార్ చిరంజీవి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి సినిమాకు సిద్దమవుతున్నాడు. ఈ చిత్రానికి నిర్మాతగా తనయుడు రామ్ చరణ్ వ్యవహరిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జాతీయ స్థాయి చిత్రంగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
18వ శతాబ్దానికి సంబంధించిన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తన జన్మదినం ఆగస్టు 22న కాకుండా ఆగస్టు 15న ప్రారంభించాలని చిరంజీవి భావిస్తున్నారట. ఓ పోరాట యోధుడి జీవితంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పంద్రాగస్టు రోజున అయితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి కోసం కొణిదెల ప్రొడక్షన్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం.
మెగా క్యాంపులో రేసుగుర్రం ధ్రువ లాంటి హిట్లను అందించిన ఘనత కలిగిన సురేందర్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. లాంచ్ తర్వాత రెగ్యులర్‌గా షూటింగ్ నిర్వహించి వచ్చే వేసవికి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే ప్లానింగ్ పెట్టుకున్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్‌లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ









