డ్రగ్స్‌కేసులో భారతీయుడికి ఉరి
- July 14, 2017
డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న ఓ నేరస్థుడికి సింగపూర్‌లో ఈ రోజు ఉరిశిక్ష అమలు చేశారు. 29 ఏళ్ల భారత సంతతికి చెందిన మలేషియా వ్యక్తి ప్రభాకరణ్ శ్రీవిజయన్‌కు అక్కడి న్యాయస్థానం 2014లో మరణశిక్షను ఖరారు చేసింది. 22.24 గ్రాములు డయామార్ఫిన్ అనే మత్తు పదార్థాన్ని రవాణా చేస్తుండగా అతన్ని 2012లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం కోర్టు అతినికి మరణశిక్ష విధించింది. అయితే మరణశిక్షను ఐక్య రాజ్యసమితి, ఇతర మానవహక్కుల సంఘాలు వ్యతిరేకించినప్పటికీ వాటిని సింగపూర్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు.
నిన్న శ్రీవిజయన్ కుటుంబసభ్యుల తరఫున అతని లాయర్ సింగపూర్ అపెక్స్ కోర్టును సంప్రదించారు. మలేషియాలో ఈ కేసుకు సంబంధించి చేసుకున్న అప్పీల్ పెండింగ్‌లో ఉందని.. ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరారు. అయితే ఓ దేశంలోని న్యాయపరమైన వ్యవహారాల్లో మరో దేశం జోక్యం చేసుకోలేదని పేర్కొంటూ జడ్జి స్టే ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో సింగపూర్‌లోని చాంగీ జైలులో శ్రీవిజయన్‌కు ఉరిశిక్ష అమలు చేశారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







