పటేల్ సర్‌ మూవీ రివ్యూ

- July 14, 2017 , by Maagulf
పటేల్ సర్‌ మూవీ రివ్యూ

సినిమాపేరు: 'పటేల్ సర్‌' 
విడుదల తేదీ: 14-07-2017
సంగీతం: వసంత్ 
ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు 
నిర్మాత: రజిని కొర్రపాటి 
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వాసు పరిమి 
నిర్మాణం: వారాహి చలన చిత్రం 
తారాగణం: జగపతిబాబు, పద్మప్రియ, తాన్య హోప్, సుబ్బరాజు, పోసాని, రఘుబాబు, శుభలేఖ సుధాకర్, బేబీ డాలీ తదితరులు.
హీరోగా పెద్దరికం సినిమా మొదలు ఎన్నో సూపర్ హిట్లు జగపతిబాబు ఖాతాలో ఉన్నాయి. తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని `లెజెండ్‌` మూవీతో విలన్ రోల్ తో రీఎంట్రీ ఇచ్చాడు జేపీ. అంతే.. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సూపర్ ఫాంలో దూసుకుపోతున్నాడు. అయితే, ఇప్పుడు స్టైలిష్ లుక్ లో `పటేల్ సర్‌` అంటూ సాయి కొర్రపాటి డైరెక్షన్లో మళ్లీ హీరోగా ట్రిపుల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇవాళే రిలీజైన ఈ మూవీ ఆడియన్స్ ని ఏమేరకు మెప్పించిందో చూద్దాం.
కథ : దేశభక్తి అణువణువునా జీర్ణించుకుపోయిన ఓ పవర్ ఫుల్ ఆర్మీ మేజర్ సుభాష్ పటేల్ (జగపతిబాబు). కార్గిల్ యుద్ధంలో ప్రాణాలొడ్డి పోరాడతాడు. తన పూర్వీకులంతా కూడా సైనికులుగా దేశానికి సేవ చేసినవారేకావడంతో తన తర్వాత తరం కూడా ఆర్మీలో చేరి దేశరక్షణ కోసం పనిచేయాలని కలలు కంటాడు. అయితే, ఆ విషయంలో తీవ్ర మనస్థాపానికి గురవుతాడు సుభాష్. చివరికి మేజర్‌గా రిటైర్డ్ అవుతాడు. అప్పుడే సుభాష్ భార్య భారతి (ఆమని) అకస్మాత్తుగా ప్రాణాలొదులుతుంది. ఉద్యోగంలో ఉండగా దేశ సరిహద్దుల్లో యుద్ధం చేసిన అతను, పదవీ విరమణ తర్వాత దేశంలోపల మరో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితులు సుభాష్ కు ఎలా ఎదురయ్యాయి? చివరికి సుభాష్ తను అనుకున్నది సాధించాడా అన్నదే సినిమా
విశ్లేషణ : పూర్తి స్థాయి రివెంజ్ స్టోరీ 'పటేల్ సర్' సినిమా. వృద్ధుడైన ఒక తండ్రి తన ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడన్నదే కథాంశం. ఫస్టాఫ్ అంతా ప్రత్యర్థుల వేటే. జగపతిబాబు స్టైలిష్ గా కనిపించాడన్న సంగతి తప్పితే, ప్రేక్షకులకు ఫస్టాఫ్ ఏమాత్రం రుచించదు. రొటీన్ రివెంజ్ స్టోరీలా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. అయితే, సెకండాఫ్ మొదలయ్యే ముందు మాత్రం డైరెక్టర్ సినిమా మీద ఓ హైప్ క్రియేట్ చేశాడనే చెప్పాలి. సెకండాఫ్ స్టార్ట్ అయ్యాక వచ్చిన ఫ్లాష్ బ్యాక్‌ సినిమాని పీక్ స్టేజ్ కు తీసుకెళ్తుంది. కుటుంబం నేపథ్యంలో వచ్చే 20 నిమిషాల సన్నివేశాలు గుండెల్ని హత్తుకుంటాయి. రివెంజ్ డ్రామా కాస్తా ఓ మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీలా మారిపోతుంది.
 
ఫస్టాఫ్ లో పటేల్ సర్ చేత ముగ్గురిని అంతం చేయించిన డైరెక్టర్ సెకండాఫ్ లో మరో ఇద్దర్ని చంపించి కథకు క్లైమాక్స్ చెప్పేస్తాడు. ఈ కథకు తను మాత్రమే సరిపోతాననేలా జగపతిబాబు నటన ఉంది. పద్మ ప్రియ.. తాన్య హోప్ లు ఓకే. విలన్ల విషయంలో డైరెక్టర్ విఫలమయ్యాడనే చెప్పాలి. కబీర్‌సింగ్, పృథ్వీ, ప్రభాకర్ ఉన్నప్పటికీ స్ట్రాంగ్ విలనిజం సినిమాలో కనిపించదు. పోసాని, రఘుబాబు మెప్పిస్తారు. మ్యూజిక్, ఫొటోగ్రఫీ, డైలాగ్స్ ఫర్వాలేదు. వారాహి నిర్మాణ విలువలు సినిమాలో కనిపిస్తాయి. డైరెక్టర్ తను అనుకున్నది తెరపైన చూపించగలిగాడన్నది సినిమా చూస్తే అర్థం అవుతుంది. అయితే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కొరవడ్డం, రొటీన్ కథనం సినిమాకి లోపాలైతే, సెకండాఫ్ ఆసక్తికరంగా నడపించాడు సాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com