తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
- July 14, 2017
వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రుతుపవనాలు తెలంగాణలో చురుగ్గా, కోస్తా, రాయలసీమల్లో ఒక మోస్తరుగా కదులుతున్నాయి. శుక్రవారం తెలంగాణలో అనేకచోట్ల, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. కోస్తాలో తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, తెలంగాణలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా, తెలంగాణాల్లో ఉరుములతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఉపరితల ప్రభావంతో రానున్న 3రోజుల్లో బంగాళాఖాతలంలో అల్పపీడనం ఏర్పడనున్నది. ఇది బలపడే క్రమంలో రుతుపవనాలు చురుగ్గా మారనున్నాయి. దీంతో కోస్తా, తెలంగాణాల్లో ఈనెల 17,18 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







