గ్యాసోలైన్‌ రంగు మార్పు: గ్యాస్‌ స్టేషన్‌ మూసివేత

- July 15, 2017 , by Maagulf
గ్యాసోలైన్‌ రంగు మార్పు: గ్యాస్‌ స్టేషన్‌ మూసివేత

రియాద్‌: రెడ్‌ పౌండర్‌ని, గ్యాసోలైన్‌లో మిక్స్‌ చేసి, తద్వారా గ్రీన్‌ నుంచి రెడ్‌ కలర్‌కి గ్యాసోలైన్‌ని మార్చేసి వినియోగదారుల్ని మోసం చేస్తున్న కేసులో ఓ గ్యాస్‌ స్టేషన్‌ని అధికారులు మూసివేశారు. మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇన్వెస్టిమెంట్‌ ఇన్‌స్పెక్టర్స్‌ ఈ మోసాన్ని గుర్తించి, తగిన పరీక్షలు నిర్వహించి, గ్యాస్‌ స్టేషన్‌ మూసివేత నిర్ణయం తీసుకున్నారు. 91 ఆక్టేన్‌ గ్యాసోలైన్‌లో ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రంగు మార్చడం ద్వారా 91 ఆక్టేన్‌ గాసోలైన్‌ని 95 గాసోలైన్‌గా విక్రయించి అధికంగా సొమ్ము చేసుకుంటున్నారు గ్యాస్‌ స్టేషన్‌ నిర్వాహకులు. ఓ వినియోగదారుడు అందించిన సమాచారం మేరకు అధికారులు ఈ దాడులు చేశారు. ఇంకో వైపున మరో వినియోగదారుడి ఫిర్యాదుతో కింగ్‌ ఖాలిద్‌ రోడ్‌లోని ఓ ఫ్యూయల్‌ స్టేషన్‌లో ప్రైస్‌ ట్యాంపరింగ్‌ జరుగుతున్నట్లు అధికారులు నిర్ధారించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com