డ్రగ్స్ పై హీరో గోపీచంద్ కామెంట్స్
- July 20, 2017డ్రగ్స్ వ్యవహారంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు సిట్ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పలువురు సినీ ప్రముఖులు దీనిపై స్పందిస్తున్నారు. తాజాగా హీరో గోపీచంద్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒత్తిడిని అధిగమించే నిమిత్తం డ్రగ్స్ కు అలవాటుపడ్డారని చెప్పడం చాలా సిల్లీగా ఉందని అన్నాడు గోపీచంద్ .
ఒత్తిడిని అధిగమించేందుకు ఎక్సర్ సైజు చేయడమో, కాసేపు నడవడమో, లేకపోతే, ఓ పుస్తకం చదవడమో, అదీ కాకపోతే ఓ సినిమాకు వెళ్లడమో .. ఇలా చాలా మార్గాలను అవలంబించవచ్చని. అంతేకానీ, డ్రగ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం కరెక్టు కాదని చెప్పాడు గోపి. ఆధారాలు లేకుండా సినీ ఇండస్ట్రీ వాళ్లే డ్రగ్స్ కు అలవాటుపడ్డారని అనడం సబబు కాదని అనవసరమైన ఆరోపణల ద్వారా వారి కుటుంబాలు దెబ్బతింటాయిని అభిప్రాయపడ్డాడు
గోపీచంద్ తాజా చిత్రం గౌతమ్ నంద విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ లో బిజీగా వున్నాడు గోపిచంద్.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…