బ్రాహ్మణ సంఘాల డిమాండ్... బిగ్ బాస్ షో ను వెంటనే బ్యాన్ చేయాలి
- July 22, 2017
తెలుగు చిత్ర పరిశ్రమలోని మొట్టమదటి రియాలిటీ షో బిగ్ బాస్. ఇందులో పార్టిసిపెంట్స్ మొత్తం సినీ రంగానికి సంబంధించిన వారే కావడం గమనార్హం. అయితే ఈ షో మొత్తం 70 రోజుల ప్రక్రియ. ఇందులో మొత్తం 14 మంది పాల్గొన్నారు. అయితే ఈ షో కు విపరీతమైన క్రేజ్ ఏర్పడడంతో రాత్రి తోమ్మిదిన్నర అయితే చాలు ప్రేక్షకులంతా టీవీలకు హత్తుకుపోతున్నారు. అయితే ఈ ప్రోగ్రాం పై చాలా వెబ్ సైట్లలో వార్తలు కూడా రాయడం జరిగింది. అయితే ఈ ప్రోగ్రాం లో చూపించే కొన్ని సన్నివేశాలపై బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఈ షోలో హోమగుండం వద్ద బ్రష్ చేసుకుంటూ చలి మంటలు కాచుకుంటున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయని, అందులో ఆజ్యం పోస్తుండటం వంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, వాటిని సవరించి, క్షమాపణ చెప్పాలని జోగుళాంబ గద్వాల జిల్లా బ్రాహ్మణ సేవాసమితి డిమాండ్ చేసింది. అంతేకాక సిగిరెట్ల కోసం వ్యక్తులు గొడవకు దిగడంఅ వైపు పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని ప్రచారం చేస్తూనే వాటికి సంబంధించిన దృశ్యాలను ప్రచారం చేయడం జరిగింది.
అవి కూడా సమాజానికి హాని కలిగించేలా ఉన్నాయని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రియాలిటీ షోలో హైందవ సంస్కృతిని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ షో ప్రారంభం అయ్యి కేవలం కొన్ని రోజులు మాత్రమే అయినా అప్పుడే వివిధ సంఘాల నుండి ఆరోపణలు వస్తున్నాయి. ఇంకా షో ముగిసే వరకు ఈ ప్రోగ్రాం ఎన్ని కొత్త సమస్యలను తెచ్చిపెడుతుందో.. దాని వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదరువుతాయో చూడాలి మరి..!
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







