ఎటిసలాట్‌ లాభాల్లో 6 శాతం వృద్ధి

- July 27, 2017 , by Maagulf
ఎటిసలాట్‌ లాభాల్లో 6 శాతం వృద్ధి

యూఏఈలో అతి పెద్ద టెలికామ్‌ ఆపరేటర్‌ అయిన ఎటిసలాట్‌, గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రెండో క్వార్టర్‌లో తమ లాభాల వృద్ది 6 శాతం ఉందని పేర్కొంది. ఎటిసలాట్‌కి ఉన్న వినియోగదారుల సంఖ్య 12.4కి చేరింది. గత ఏడాదితో పోల్చితే ఇది రెండు శాతం అదనం. ఎటిసలాట్‌ గ్రూప్‌ మిడిల్‌ ఈస్ట్‌తోపాటుగా ఆఫ్రికా మరియు ఆసియాల్లోనూ విస్తరిస్తోంది. గ్లోబల్‌ మార్కెట్‌లో తనదైన ప్రత్యేకతను చాటుకునేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇంకో వైపున నైజీరియన్‌ ఆర్మ్‌తో గతంలో చేసుకున్న ఒప్పందాన్ని ఎటిసలాట్‌ రద్దు చేసుకుంది. నైజీరియన్‌ బిజినెస్‌లో యూఏఈకి చెందిన ఎటిసలాట్‌ 45 శాతం వాటా కలిగి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com