త్వరలో నూతన టెలికాం విధానం
- July 28, 2017
నూతన టెలికాం విధాన ముసాయిదా ప్రక్రియను ఆ శాఖ చేపట్టింది. ఈ ఆర్థిక ఏడాది చివరికల్లా ఇది సిద్ధం కానుంది. ‘ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా వృద్ధి చెందుతుండటంతో టెలికాం శాఖ నూతన జాతీయ టెలికాం విధాన ప్రక్రియ ఆరంభించింది. ఈ ఆర్థిక ఏడాది చివరికల్లా ముసాయిదా సిద్ధమవుతుంది’ అని టెలికాం మంత్రి మనోజ్ సిన్హా రాజ్యసభలో తెలిపారు. సాంకేతిక సృజన, భద్రత, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ వంటి అంశాలు ఇందులో ఉంటాయని మంత్రి వెల్లడించారు. ప్రస్తుత జాతీయ టెలికాం విధానం 2012లో అమల్లోకి వచ్చింది. స్పెక్ట్రమ్ లైసెన్సుల కేటాయింపు, పంచుకోవడం, స్పెక్ట్రమ్ వ్యాపారం, బ్రాండ్‌బ్యాండ్ వేగం, చోరీ అయిన మొబైళ్లను బ్లాక్ చేయడం వంటివి ఈ విధానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, 2 ఎంబీపీఎస్ బ్రాండ్‌బ్యాండ్ వేగాన్ని మాత్రం ఇంకా అందుకోలేదు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







