అమిర్ ఖాన్ తాజా చిత్రం సీక్రెట్‌ సూపర్‌స్టార్‌ ఫస్ట్ లుక్ రిలీస్

- July 31, 2017 , by Maagulf
అమిర్ ఖాన్ తాజా చిత్రం సీక్రెట్‌ సూపర్‌స్టార్‌ ఫస్ట్ లుక్ రిలీస్

దంగల్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అమిర్ ఖాన్ తాజాగా సీక్రెట్‌ సూపర్‌స్టార్‌ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం లో ఆమిర్‌ ఖాన్‌, జైరా వాసిం ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ను కొద్దీ సేపటి క్రితం చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసారు.
ఈ ఫస్ట్ లుక్ లో జైరా వాసిం స్కూల్‌ డ్రెస్‌ వేసుకుని నడుచుకుంటూ వెళుతున్నట్లు కనిపించింది. ఈ చిత్రంలో జైరా వాసిం గాయని కావాలని ఆశపడుతుంది. కానీ తన తండ్రి రోజూ తాగి వచ్చి తనని, అమ్మని చిత్రహింసలు పెడుతుంటాడు. తన తల్లిని తాగుబోతు తండ్రి నుంచి కాపాడుకుని తన ఆశయం ఎలా నెరవేర్చుకుంటుంది అన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆమిర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఆమిర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ ఆగస్టు 2న విడుదల కాబోతుంది. దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com