ఫ్యాన్‌కు వార్నింగ్ ఇచ్చిన బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా
- July 31, 2017
భారత బ్యాడ్మింటన్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న గుత్తా జ్వాలా ఆటకంటే మిగిలిన అంశాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ట్విట్టర్ వేదికగా నెలకొన్న ఒక వివాదం మరోసారి జ్వాలలో ఆగ్రహం రగిలించింది. అసలు విషయం ఏంటంటే... ట్విట్టర్‌లో జ్వాల ఇటీవలే ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో జ్వాల, ఆమె సోదరితో పాటు తల్లి ఇన్సి కూడా కనిపిస్తారు. ఈ వీడియోపై పలువురు అభిమానులు చేసిన వ్యాఖ్యలు ఆమెకు కోపం తెప్పించాయి. ముఖ్యంగా ఒక అభిమాని మీ తల్లి చైనా నుంచి వచ్చారు కనుకే మీరు ప్రధాని మోడీపై వ్యతిరేకత చూపిస్తుంటారు కదా అంటూ ప్రశ్నించడంతో జ్వాల మండిపడింది. చాలా సేపు ఆ అభిమాని , జ్వాల మధ్య మాటల యుధ్ధం నడిచింది. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో అంటూ ఘాటుగా స్పందించింది. ఏదైనా అడగాలనుకుంటే తనను నేరుగా ప్రశ్నించాలని , మధ్యలో తల్లిదండ్రుల ప్రస్తావన ఎందుకు తెచ్చావంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి రిపీట్ చేస్తే నాలో మరో కోణాన్ని చూస్తావంటూ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది.
ప్రస్తుతం భారత్-చైనా మధ్య సరిహద్దు ప్రాంతాల్లో సరైన సంబంధాలు లేవు. ఇలాంటి సమయంలో జ్వాల పెట్టిన వీడియోపై పలువురు నెటిజన్లు చైనాతో ముడిపెట్టి స్పందించడం వివాదానికి కారణమైంది. చైనా దేశీయురాలు అయిన జ్వాల తల్లి హైదరాబాద్‌కు చెందిన క్రాంతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఇండియా-చైనా మధ్య కోల్డ్‌వార్ నడుస్తోన్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా పలువురు ఆమెపై ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. అయితే ముక్కుసూటిగా మాట్లాడే జ్వాలా కూడా వారందరికీ ఘాటుగానే బదులిచ్చింది. సరిహద్దు వివాదాన్ని అందరితో ముడిపెట్టడం సరికాదని వ్యాఖ్యానించింది. గత కొంత కాలంగా ఆటకు దూరంగా ఉంటోన్న ఈ హైదరాబాదీ షట్లర్ ఇటీవల బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన కోచ్‌ల జాబితాలో చోటు దక్కించుకుంది. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించకున్నా.. బాయ్ ఆమెను కోచ్‌ల జాబితాకు ఎంపిక చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం తాజా వివాదంలో మరోసారి వార్తల్లో నిలిచిన జ్వాలాకు కొందరు మధ్ధతుగా నిలుస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







