అందరినీ కరిగించిన నటుడు ధన రాజ్ కన్నీటి వ్యథ

- July 31, 2017 , by Maagulf
అందరినీ కరిగించిన నటుడు ధన రాజ్ కన్నీటి వ్యథ

‘బిగ్‌ బాస్‌’ లో నిన్న సోమవారం ధనరాజ్ వ్యక్త పరిచిన కన్నీటి వ్యథ అందరినీ కరిగించి వేసింది.  ముఖ్యంగా ధన్‌ రాజ్ ఎమోషన్స్ బుల్లితెర ప్రేక్షకులను కూడా భావోద్వేగానికి గురిచేసి తమ కంట కన్నీరు వచ్చేలా చేసింది. ముందుగా ఎన్టీఆర్ లీకులు ఇచ్చినట్లుగానే నిన్నటి షోలో ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ‘బిగ్ బాస్’ లో ఫైనల్ విన్నర్ అవుతాడు అని ప్రచారంలో ఉన్న ధన రాజ్ నిన్నటి షోలో ఎవరి ఊహలకు అందని ట్విస్ట్ ఇచ్చాడు.
ధన్‌ రాజ్‌ ను ‘బిగ్‌బాస్’ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి ఏమైనా చెప్పాలనుకొంటున్నావా అని అడిగారు బిగ్ బాస్. దానికి సమాధానం ఇస్తూ ధన రాజ్ తన భార్య ఎనిమిదో నెల గర్భంతో ఉందని చెపుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ తన ఉద్వేగాన్ని బయట పెట్టాడు ధన రాజ్. 
అంతేకాదు ‘బిగ్‌ బాస్‌’ లోకి వచ్చిన తర్వాత తొలివారమే తాను ఎలిమినేట్ అవుతానని భావించానని అయితే రెండవ వారం పూర్తి అయిపోయినా తాను ఎలిమినేట్ కాకుండా నిలబడటంతో తనకు టెన్షన్ పెరిగి పోయింది అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు ధన రాజ్. ప్రస్తుతం గర్భవతి అయిన తన భార్య సిరికి తాను అన్ని రకాల సేవలు చేయాలనుకొంటున్నాను అంటూ తన భార్య పై తన ప్రేమను వ్యక్త పరిచాడు.
ఇక్కడ తాను ఎంతోమందికి ఎన్నో రకాల సేవలు చేస్తునన్నాను అని అంటూ ఇప్పటివరకు  తన భార్యను పట్టించుకోలేదు అని ఆవేదన వ్యక్త పరుస్తూ తనకు తన భార్య సర్వస్వం అంటూ తన ప్రేమను వ్యక్తపరిచాడు ధన రాజ్. అదేవిధంగా తాను ‘బిగ్ బాస్’ షోలోకి వచ్చిన తరువాత పూర్తిగా మారిపోయానానని ఉద్వేగానికిలోను అవుతూ ధన రాజ్ తన కంట కన్నీరు పెట్టుకున్నాడు.  
‘సిరి నీవు సమయానికి ట్యాబ్లెట్లు వేసుకో, ఆరోగ్యం బాగా చూసుకో, సుక్కు నీవు అమ్మను ఇబ్బంది పెట్టకు, నేను త్వరలోనే వస్తాను, గర్భంలో ఉన్న చిట్టితల్లి నీవు ఈ ప్రపంచంలోకి వచ్చే సరికి నీకు ఓ గొప్ప ఫాదర్‌గా మారుతాను. నీ తండ్రి గొప్ప సెలబ్రిటీ అనే విధంగా కష్టపడుతాను’ అంటూ ధనరాజ్ కన్నీటితో వ్యక్త పరిచిన మాటలు నిన్నటి ‘బిగ్ బాస్’షోకి టచింగ్ గా మారాయి.  అయితే ఇది అంతా ఈ షోకి రేటింగ్స్ పెంచడాని ఆలోచించన వ్యూహమా ? లేదంటే త్వరలోనే ధన్ రాజ్ కూడ సంపూ బాట పడతాడా అన్న సందేహాలు కూడ వ్యక్తం అవుతున్నాయి..
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com