కొత్త డ్రైవింగ్ స్కూల్స్ కోసం 20 అప్లికేషన్లు
- August 01, 2017
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ - లైసెన్స్ డిపార్ట్మెంట్కి 20 అప్లికేషన్లు అందాయి. కొత్త డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు కోసం ఈ అప్లికేషన్లు వచ్చాయి. లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ సలెమ్ సక్ర్ అల్ మురైకి ఈ విషయంపై స్పందిస్తూ, వీటిల్లో కొన్ని అప్లికేషన్లకు ఆమోదం లభించే అవకాశం ఉందనీ, నిబంధనలకు అనుగుణంగా వచ్చిన వాటికి అనుమతిస్తామని తెలిపారు. తగినంత స్థలం, తగినన్ని వాహనాలు, ఇన్స్ట్రక్టర్స్, ట్రైనింగ్ హాల్స్ వంటివన్నీ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని ఆయన చెప్పారు. రోడ్ టెస్ట్‌కి సంబంధించి రెండు ఛాన్స్‌లు సరిపోవడంలేదంటూ వస్తున్న అభ్యంతరాలపై స్పందించిన సలెమ్, పూర్తిస్థాయి అధ్యయనం తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అల్ వుకైర్, అల్ షీహానియా ప్రాంతాల్లో రెండు కొత్త వెహికిల్ టెక్నికల్ ఇన్స్పెక్షన్ స్టేషన్లను ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. అల్ వుకైర్లో హెవీ వెహికిల్స్ కోసం ముందుగా ఇన్స్పెక్షన్ అందుబాటులోకి తెచ్చి, ఆ తర్వాత లైట్ వెహికిల్స్ ఇన్స్పెక్షన్ని అందుబాటులోకి తెస్తామన్నారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







