అమెరికాలో గ్రీన్‌ కార్డుల జారీ ఇక పాయింట్ల పద్ధతిలోనే

- August 03, 2017 , by Maagulf
అమెరికాలో గ్రీన్‌ కార్డుల జారీ ఇక పాయింట్ల పద్ధతిలోనే

అమెరికాలో శాశ్వత నివాసం ఉండాలనుకునే విదేశీయులు గ్రీన్‌ కార్డ్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్‌కార్డులకు సంబంధించి అనేక మార్పులు తీసుకొచ్చారు. అర్హతల ఆధారంగా పాయింట్లు, ఇంగ్లీష్‌ మాట్లాడటం, అధిక జీతం పొందడం, చిన్న కుటుంబాలను కలిగి వుండటం, అమెరికా ఆర్ధిక వ్యవస్థకు సదరు విదేశీయుడి సేవలు ఎంత మేరకు అవసరం అనేది పరిగణనలోకి తీసుకుంటారు. ఇప్పుడు దీనిని అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజంగా అమోరికా కోసం పాటు పడేవాళ్ళకే ఈ అవకాశం
దక్కుతుందని అధ్యక్షుడి ప్రధాన సలహాదారు జేసన్‌ మిల్లర్‌ తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com