ఈ డ్రైవర్ 1.2 మిలియన్ ధిర్హాంల ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాల్సిఉంది

- August 02, 2017 , by Maagulf
ఈ డ్రైవర్  1.2 మిలియన్ ధిర్హాంల  ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాల్సిఉంది

తప్పులన్నీ...తడిచి మోపెడైనట్లు...జరిమానాలన్నీ జడివాన మాదిరిగా ఆసియా దేశానికి చెందిన ఓ  డ్రైవర్ మీద పడింది. లక్షలాది ధిర్హాంలను  జరిమానాలు రూపంలో చెల్లించాల్సిన కారణంగా ఒక ఆసియా డ్రైవర్ ను  ట్రాఫిక్ ప్రాసిక్యూషన్ వద్దకు పంపించారు. వాసిట్ పోలీస్ స్టేషన్ డిప్యూటీ డైరెక్టర్ మేజర్ మొహమ్మద్ అబ్దుల్ రహ్మాన్ బిన్ కాస్మొల్ మాట్లాడుతూ, నిందితుడు132 ట్రాఫిక్ నేరాలకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. పలు  నేరాలకు సంబంధించి 1.19 మిలియన్ల దిర్హామ్ల మేరకు జరిమానా విధించారు. ఆయా జరిమానాలు చెల్లించడంలో ఆ డ్రైవర్  విఫలమయ్యాడని అన్నారు. షార్జాలోని రోడ్ల అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ జారీ చేసిన మరో నేరంలో  'ప్రయాణీకుల అక్రమ రవాణా' చేస్తున్నందుకు అనేక జరిమానాలు ఆ వ్యక్తిపై నమోదైయ్యాయి. అంతేకాక ఆ డ్రైవర్ రహదారిపై వెళ్లాల్సిన వరుసల గీతల పై వెళ్లకుండా క్రమశిక్షణను నిర్వహించడం లేదని ఆయన తెలిపారు. ఇతర ఎమిరేట్ లోని  కొన్ని ప్రాంతాలలో ఇతర నేరాలకు పాల్పడినట్లు జరిమానాలు సైతం విధించినట్లు  మేజర్ బిన్ కస్మోల్ చెప్పారు. ఈ  డ్రైవర్ ఒక సొంత వాహనాన్ని కలిగి ఉండి  దానిని చట్టవిరుద్ధంగా టాక్సీగా ఉపయోగించారు. ఆ వాహనంపై  నమోదు కాబడిన జరిమానాలు 214,730 ధిర్హాంలు  జరిమానాలు ఉండగా  అతని డ్రైవింగ్ లైసెన్స్ లపై  879,110 ధిర్హాంలు ఉన్నాయి. "ప్రయాణీకులను అక్రమ రవాణాకు గాను ఆ  జరిమానా 5,000 ధిర్హాం వరకు ఉంటుందని అదే నేరాన్ని  డ్రైవర్  మళ్ళీ తిరిగి నమోదు చేసినట్లయితే   ఆపై డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ పై అది 10,000 రూపాయలకు రెట్టింపు కాబడుతుంది.  ఈ డ్రైవర్ యొక్క నేరాలకు సంబంధించిన జాబితాలో వేగవంతమైన డ్రైవింగ్ చేయడం, తన వాహనం పక్కన వెళుతున్న ఇతర వాహనదారులపట్ల అమర్యాదగా ప్రవర్తించడం  నిషేధిత ప్రాంతాలలో తన వాహనాన్ని పార్కింగ్ చేయడంతో పాటు ఆ డ్రైవర్  ట్రాఫిక్ సూచనలను ఏమాత్రం అనుసరించడం లేదని వివరించారు. ఆ ఉళ్ల్లంఘనలకు వాస్తవంగా చెల్లించాల్సిన జరిమానాలు ఎందుకు రెట్టింపు కాబడినవంటే, ఆ మొత్తాలను సకాలంలో చెల్లించకపోవడంతో అవి పెరిగిపోయినట్లు మేజర్ బిన్ కాస్మొల్  తెలిపారు. కొత్త ట్రాఫిక్ చట్టం ప్రకారం, జూలై 1 వ తేదీ నుంచి  డ్రైవర్ కోసం నమోదు చేయబడిన ఒక వాహనానికి బదులుగా వేరే ఇతర  వాహనాన్ని ఉపయోగించిన డ్రైవర్ కు 3,000 ధిర్హాం ల జరిమానాతో పాటు మరియు నాలుగు నలుపు పాయింట్లను పొందుతారు. ప్రయాణీకులను రవాణా చేసే అనుమతి లేకుండా వాహనాన్ని నడిపితే   ట్రాఫిక్ చట్టం 76 అధికరణం ప్రకారం 3,000 ధిర్హాంలతో పాటు  24 బ్లాక్ పాయింట్లు మరియు ఆ వాహనం స్వాధీనం చేసుకోవడమే కాక 30 రోజుల పాటు దానిని జప్తు చేయడం జరిగింది. ఇటీవల ఆ  డ్రైవర్ ను  పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తిపై దర్యాప్తు పూర్తి చేయడానికి షార్జా ట్రాఫిక్ ప్రాసిక్యూషన్ కు పంపినట్లు  మేజర్ బిన్ కస్మోల్ చెప్పారు. వాహనాలు నడిపే డ్రైవర్లు సురక్షితమైన రహదారులు కల్గి ఉండేలా ట్రాఫిక్ సూచనలను కచ్చితంగా అనుసరించాలని రహదారులు వాహన ఉల్లంఘనలకు పాల్పడే ఒక సాధనం ఏమాత్రం కాదని అయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com