బెస్ట్‌ ఆన్‌బోర్డ్‌ అమెనిటీస్‌: కువైట్‌ ఎయిర్‌వేస్‌కి అవార్డ్‌

- August 03, 2017 , by Maagulf
బెస్ట్‌ ఆన్‌బోర్డ్‌ అమెనిటీస్‌: కువైట్‌ ఎయిర్‌వేస్‌కి అవార్డ్‌

కువైట్‌ ఎయిర్‌వేస్‌, బెస్ట్‌ ఆన్‌బోర్డ్‌ ఎమినిటీస్‌ కేటగిరీలో పురస్కారం అందుకుంది. యాన్యువల్‌ ట్రావెల్‌ ఎగ్జిబిషన్‌లో ఈ పరస్కారం దక్కించుకుంది కువైట్‌ ఎయిర్‌వేస్‌. జర్మన్‌ నగరం హంబర్గ్‌లో ఈ ఈవెంట్‌ జరిగింది. కువైట్‌ ఎయిర్‌వేస్‌ హెడ్‌ ఆఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఫాయెజ్‌ అల్‌ ఎనెజి ఈ విషయం గురించి మాట్లాడుతూ, కువైట్‌ నేషనల్‌ కెరీర్‌ అయిన కువైట్‌ ఎయిర్‌లైన్స్‌ని గ్లోబెట్రాటర్స్‌ సౌకర్యాల పరంగా అత్యున్నత స్థానానికి ఎంపిక చేశారని అన్నారు. గ్లోబల్‌ ట్రావెలర్‌ మ్యాగజైన్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా సర్వే నిర్వహించి, ఈ అరుదైన పురస్కారాన్ని కువైట్‌ ఎయిర్‌వేస్‌కి అందజేశారు. ప్రయాణీకులకు మెరుగైన సేవలందించేందకు కువైట్‌ ఎయిర్‌వేస్‌ ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటుందని ఫయెజ్‌ అల్‌ ఎనిజి చెప్పారు. కువైట్‌ ఎయిర్‌వేస్‌ని 1962లో కువైట్‌ గవర్నమెంట్‌ సొంతం చేసుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com