'లై' సెన్సార్ రివ్యూ
- August 09, 2017
ఆగస్ట్ 11 న రాబోతున్న మూడు సినిమాలలో లై చిత్రం ప్రత్యేకత చాలానే ఉంది. డైరెక్టర్ హను రాఘవపూడి డిఫరెంట్ టేకింగ్ అనే పేరు సంపాదించుకున్నాడు. అతని మొదటి చిత్రం అందాల రాక్షసి ప్లాప్ అయినా క్రిటిక్ అప్లాజ్ లు పొందింది. రెండో సినిమా కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సూపర్ హిట్ అవ్వడమే కాక నానీ కెరీర్ లో ఒక గుర్తుండిపోయే సినిమాగా మారింది.
ఇప్పుడు లై అంటూ వస్తున్న హను నితిన్ ని చాలా కొత్తగా ఫుల్ గడ్డం తో చూపించాడు. నితిన్ మేక్ ఓవర్ - విలన్ గా అర్జున్ లుక్స్ - ట్రైలర్ లో డైలాగులూ ఇవన్నీ చూసి చెప్పేయచ్చు హనూ ఈ చిత్రాన్ని ఎంత డిఫరెంట్ గా మలిచాడు అనేది. రీసెంట్ గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ అందింది .
ఈ సినిమా విషయం లో మన వెబ్సైటు కి అందుతున్న ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ట్రైలర్ లాగానే సినిమా కూడా ఆసక్తికరంగా సాగుతుంది అంటున్నారు. అబద్ధాల మీద మాత్రమే బతకగలం అని చిన్నతనం నుంచే మైండ్ ని ఫిక్స్ చేసుకున్న ఒక అబ్బాయి జీవితం మొత్తం అబద్ధాలతో నింపేసుకుంటాడు. తాను ప్రేమించిన అమ్మాయిని కూడా అలాగే డీల్ చేస్తాడు ఇతగాడు.
అనాధగా పెరిగి లైఫ్ మీద పెద్దగా ఫోకస్ లేని ఇతను ఆ అమ్మాయి కారణంగా ఒక ఇబ్బంది లో ఇరుక్కుని ఇంటర్వెల్ లో తానేంటో , అతని కుటుంబం ఏంటో తెలుసుకుంటాడు. ఇక్కడ ఒక అద్భుతమైన ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఫుల్ యాక్షన్ సీన్ లు, థ్రిల్లింగ్ గా సాగే సీక్వెన్స్ లతో సినిమా మొత్తం ఆసక్తికరంగా సాగుతుంది అని టాక్. క్లైమాక్స్ కాస్తంత సాగింది అని తెలుస్తోంది. యాక్షన్ కింగ్ గ ఆర్జున్ నటన కుమ్మేసింది అనీ ఈ సినిమా తరవాత అతనికి విలన్ గా తెలుగులో చాలా ఆఫర్స్ వస్తాయి అంటున్నారు. మొత్తం మీద మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ కి ఎక్కువగా రీచ్ అయ్యేలా సినిమా ఉంటుంది అంటున్నారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









