డబ్బు అపహరించిన కేసులో ఆసియా కార్మికుడు జైలుశిక్ష ...దేశ బహిష్కరణ

- August 12, 2017 , by Maagulf
డబ్బు అపహరించిన కేసులో ఆసియా కార్మికుడు  జైలుశిక్ష ...దేశ బహిష్కరణ

 2,000 బేహారిన్ దినార్లను దొంగతనం చేసిన కేసులో 32 ఏళ్ల ఆసియా దేశస్థుడికి మూడు నెలల జైలుశిక్ష అనంతరం దేశం నుంచి బహిష్కరణ శిక్షను సెంట్రల్ హయ్యర్ క్రిమినల్ కోర్ట్ (అప్పీల్స్ కోర్టు) విధించింది. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు ఒక క్లయింట్ నుండి 2,000 బేహారిన్ దినార్లను తీసుకొన్న తర్వాత రుసటి రోజున రసీదుని అందజేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాక ఆ నిందితుడు తానూ పనిచేస్తున్న  తన యజమానిని వద్దకు వెళ్లి తనకు అత్యవసరంగా సెలవులు కావాలని అందుకు అనుమతించమని కోరారు, తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా తానూ వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందని నమ్మబలికెడు.  ఆ యజమాని ప్రతివాది మాటలకు కరిగిపోయి 500 బేహారిన్ దినార్లనుతన విమాన టికెట్ మరియు రెసిడెన్సీ రద్దు ఫీజుల ఖర్చుతో యజమాని నిందితునికి అత్యవసర సెలవును మంజూరు చేయడానికి అంగీకరించాడు.తన డబ్బుకి ఎటువంటి రసీదు ఇవ్వకుండా దేశం నుంచి నిందితుడు   పారిపోవడానికి ఆ ఉద్యోగి యత్నిస్తున్నట్లు కస్టమర్ పోలీసులకు పిర్యాదు చేసాడు. నిందితుడిని అరెస్టు చేసినపుడు, తనపై వచ్చిన ఆరోపణలను ప్రతివాది ఖండించాడు ఏది ఏమయినప్పటికీ, ముద్దాయిని మూడు నెలల పాటు ఖైదు చేసి, దేశం నుండి  బహిష్కరించి తిరిగి  రాజ్యములో ప్రవేశించకుండా శాశ్వతంగా నిషేధించాలని తుది తీర్పు కోర్టు ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com