27న బెజవాడకు అమిత్‌ షా

- August 12, 2017 , by Maagulf
27న బెజవాడకు అమిత్‌ షా

2019 ఎన్నికల నేపథ్యంలో ఏపీలో బలోపేతమయ్యేందుకు బీజేపీ ప్రణాళికా బద్ధంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తరచుగా రాష్ట్రానికి వస్తూ పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు ఆయన బెజవాడలో మకాం వేయనున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 90 రోజుల పాటు పర్యటించిన షా జూన్‌లో తెలుగు రాష్ట్రాల పర్యటకు వచ్చారు. తెలంగాణలో మూడు రోజులు పర్యటించినా ఏపీలో మాత్రం విజయవాడ సభకే పరిమితమయ్యారు. వార్డు కమిటీలు తొందరగా పూర్తి చేయాలని, త్వరలో మళ్లీ వస్తానని చెప్పిన ఆయన.. రాష్ట్రంలో పార్టీకి పెద్దదిక్కయిన వెంకయ్యఉప రాష్ట్రపతి అయ్యాక వస్తుండడం గమనార్హం. మూడు రోజుల పాటు విజయవాడలోనే మకాం వేసి ఒకరోజు రాష్ట్ర పార్టీ ముఖ్యులు, రాష్ట్ర మోర్చాల అధ్యక్షులతో, రెండో రోజు జిల్లాల అధ్యక్షులు, మేధావులు, పార్టీ అనుబంధ సంఘాల ముఖ్యులతో మాట్లాడతారు. మూడో రోజు బూత్‌ కమిటీలతో జిల్లాకు ఐదు నుంచి పది మందితో ఫోనులో మాట్లాడతారని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com