తెలంగాణా ప్రజా సమితి- ఖతార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన దసరా,బతుకమ్మ మరియు బక్రీద్ సంబరాలు

- October 24, 2015 , by Maagulf

23-10-2015 రోజున తెలంగాణా ప్రజా సమితి ఖతార్ ఆధ్వర్యంలో దోహా ఖతార్ లోని అల్ మహా అకాడమిలో జరిగిన  దసరా, బతుకమ్మ మరియు బక్రీద్ సంబరాలకు పెద్ద ఎత్తున స్పందించి కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజా సమితి ఖతార్ తరపున హృదయపూర్వక ధన్యవాదములు.  ఈ కార్యక్రమంలో 2015 -16 కార్యవర్గం ఏమ్పికా మరియు ప్రమాణ స్వీకారం, బతుకమ్మ ఆటలు, దాన్దియ నృత్యం, బాల బాలికల నృత్య ప్రదర్శన, సాంస్కృతిక నృత్యాలు, బక్రీద్ అలై భాలాయి, పిల్లల పలు రకాల వేషధారణ, ఫ్యామిలి ఆటలు, తెలంగాణా సాంస్కృతిక బృందం ధూమ్ ధామ్, దసరా జమ్మి ఆకు పంచుకొని అలై భాలాయి, ఈ కార్యక్రమం లో ఖతార్ తెలంగాణా కార్మికులు స్వయంగా చేసిన తెలంగాణా కాకతీయ కళాతోరణం ప్రత్యేక ఆకర్షణ, బతుకమ్మ వేషధారణ, సంప్రదాయ నృత్యం, తెలంగాణా జానపద గాయకుల గాత్రం ఆకట్టుకొన్నాయి. 

ఈ కార్యక్రమం లో ఇండియన్ కల్చరల్ సెంటర్ ఖతార్ (ICC ) అధ్యక్షులు శ్రీ గిరీష్ కుమార్ గారు , ICBF నుండి  శ్రీ అరవింగ్ పాటిల్ గారు, Indian Embassy ఖతార్ నుండి  శ్రీ సరూప్ సింగ్  గారు ముఖ్య అథిదులుగా  పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వారి సందేశాన్ని అందించారు.


ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలంగాణా ప్రజా సమితి, ఖతార్ వారికి మాగల్ఫ్.కామ్ తరపున ప్రత్యేక అభినందనలు.

 

--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com