వక్కంతం వంశీ, వెంకటేష్ కోసం ఓ యాక్షన్ స్టోరీని రెడీ చేశాడట
- October 24, 2015
'గోపాల గోపాల' లాంటి సక్సెస్ ఫుల్ చిత్రం తరువాత తదుపరి సినిమాపై విక్టరీ వెంకటేష్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. యంగ్ హీరోలు హవా చూపిస్తుండటంతో ఎలాంటి కథ ఎంచుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో వరుసగా కథలు వింటూ కాలం గడిపేస్తున్నాడు ఈ సీనియర్ హీరో. ఈ గ్యాప్ లో మారుతి, క్రాంతి మాధవ్ లాంటి దర్శకులకు వెంకీ ఓకె చెప్పాడన్న టాక్ వినిపించినా, ఆ సినిమాలేవి సెట్స్ మీదకు రాలేదు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. తెలుగులో మోస్ట్ సక్సెస్ ఫుల్ కథా రచయితగా గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ, వెంకటేష్ కోసం ఓ యాక్షన్ స్టోరీని రెడీ చేశాడట. ఇప్పటికే ఈ కథను వెంకీకి వినిపించిన వంశీ అంగీకారం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని వక్కంతం వంశీ స్వయంగా ప్రకటించాడు. ఈ కథలో వెంకటేష్ ను మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించనున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మారుతి, క్రాంతి మాధవ్ లు సొంత కథలతో వెంకటేష్ డేట్స్ కోసం ఎదురుచూస్తుండగా, వక్కంతం వంశీ ఇచ్చిన కథను గోపాల గోపాల ఫేం కిశోర్ కుమార్ పార్థసాని డైరెక్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఈ మూడు ప్రాజెక్ట్స్ లో వెంకీ, ఏ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళతాడో చూడాలి
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







