అఖిల్ రెండో సినిమా 'హలో'
- August 21, 2017
అఖిల్ రెండో సినిమాకు టైటిల్ కన్ఫర్మ్ అయింది. తొలి మూవీని తన పేరుమీదే కానిచ్చుకున్న అఖిల సెకండ్ మూవీకి.. 'హలో' పేరును ఖరారు చేసున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు 'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తారు. మలయాళ డైరెక్టర్ ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ ఇందులో అఖిల్ పక్కన హీరోయిన్‌గా నటిస్తోంది. విక్రమ్ - వినోద్ బాణీలిస్తారు. నిజానికి ఈ సినిమా టైటిల్ మీద నాగార్జున ఒక పెద్ద డ్రామానే నడిపించాడు. 'నిర్ణయం' సినిమాలోని 'హలో గురు ప్రేమ కోసమేరా జీవితం' పాట వీడియోను ట్విట్టర్‌లో పెట్టి అఖిల్ కొత్త సినిమా టైటిల్ ఈ పాటలోనే ఉంది.. ట్రేసవుట్ చేయండి అంటూ స్వీట్ ఛాలెంజ్ విసిరారు.
ఇటు.. చైతూ కూడా 'ఏం మాయ చేసావే' సినిమాలోని 'ఎవ్రీబడీ వాన్నా నో వాట్ వుయ్ లైక్' అనే పాటని ట్వీట్ చేశారు. ఇందులో అఖిల్ మూవీ టైటిల్ ని వెదుక్కోండి అంటూ అభిమానులకు హింట్ ఇచ్చేశాడు. నాగ్, చైతూ ట్వీట్ చేసిన పాటల్లో ఉన్న ఏకైక పదం 'హలో'. దీనికి అనుగుణంగానే సినిమా యూనిట్.. హలో పేరును ఫైనల్ చేసింది. అఖిల్ డెబ్యూ మూవీ దెబ్బతినడంతో.. ఈ సెకండ్ ఎఫర్ట్ అయినా సక్సెస్ కొడుతుందని.. అక్కినేని ఫ్యామిలీ ఆశిస్తోంది. లెట్ అజ్ విష్ దెమ్ గుడ్ లక్!
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







