యూఏఈలో అక్టోబర్‌ 1 నుంచి ఎక్సయిజ్‌ ట్యాక్స్‌

- August 22, 2017 , by Maagulf
యూఏఈలో అక్టోబర్‌ 1 నుంచి ఎక్సయిజ్‌ ట్యాక్స్‌

అబుదాబీ: అక్టోబర్‌ 1, 2017 నుంచి ఎక్సయిజ్‌ చట్టం అమల్లోకి రానుంది యూఏఈలో. మినిస్ట్రీ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఎక్సయిజ్‌ ట్యాక్స్‌ అన్ని ఎక్సయిజ్‌ గూడ్స్‌పైనా ఉంటుందని మినిస్ట్రీ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఔట్‌బౌండ్‌ ట్రావెలర్స్‌ ద్వారా దేశం నుంచి బయటకు వెళ్ళే కమోడిటీస్‌పై ఈ ట్యాక్స్‌ ప్రభావం ఉండదు. అయితే దేశంలోకి తీసుకొచ్చే కమోడిటీస్‌పై మాత్రం ట్యాక్స్‌ తప్పనిసరి. ట్యాక్స్‌ రేట్లు 200 శాతం మించకుండా ఉంటాయి. ఆరోగ్యకరమైన సమాజం కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఫెడరల్‌ బడ్జెట్‌కి యాన్యువల్‌ రెవెన్యూస్‌ విభాగంలో 7 బిలియన్‌ దిర్హామ్‌లు ఈ ట్యాక్స్‌ ద్వారా జనరేట్‌ అయ్యే అవకాశం ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com