ఇటలీ పర్యాటక కేంద్రంలో సోమవారం బారి భూంకంపం

- August 22, 2017 , by Maagulf
ఇటలీ పర్యాటక కేంద్రంలో  సోమవారం బారి భూంకంపం

- ఒకరు మృతి, పలువురికి గాయాలు 
ఇటలీలోని ఇచియా అగ్నిపర్వత ప్రాంతానికి సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంలో సోమవారం భూకంపం సంభవించింది. రిచ్‌టర్‌ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. ఈ భూకంప తీవ్రతకు స్థానిక మహిళ ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. అనేకమంది ఆచూకీ తెలియరావడం లేదు. వీరు కూలిపోయిన భవనాల కింద చిక్కుకుపోయి వుంటారని భావిస్తున్నారు. పలు భవనాలు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. శిధిలాల కింద చిక్కుకుపోయి చనిపోయిన ఆ మహిళ మృతదేహాన్ని ఇంకా వెలికితీయలేదు. శిధిలాల వెలికితీతకు చర్యలు తీసుకుంటున్నామని, పెద్ద ఎత్తున గాలింపు చేపట్టామని అధికారులు తెలిపారు. శిధిలాల కింద చిక్కుకుపోయిన ముగ్గురు పిల్లలను కాపాడారు. ఆ దీవి నుండి ప్రజలను తరలించేందుకు బోట్లను, హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. గాయపడిన వారిని వైద్య సాయం నిమిత్తం హెలికాప్టర్లలో తక్షణమే నాప్లెస్‌కు తరలించారు. నాప్లెస్‌ నగరానికి సమీపంలో, ఇటలీ తీర ప్రాంతానికి 10కిలోమీటర్ల దూరంలో రాత్రి 9గంటల సమయంలో భూ కంపం వచ్చినట్లు స్థానిక మీడియా వార్తలు తెలిపాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com