మామిడి పేడా
- August 23, 2017కావలసిన పదార్థాలు: మామిడిపండ్ల గుజ్జు- 2 కప్పులు, పంచదార పొడి- 1/2 కప్పు, నెయ్యి- 3 టీ స్పూన్లు, పచ్చికోవా- 1 కప్పు, కండెన్సడ్ మిల్క్- 1 కప్పు, యాలకుల పొడి- 1/4 టీ స్పూను, బాదం, పిస్తా తురుము- 1 టేబుల్ స్పూను.
తయారీ విధానం: ఒక నానస్టిక్ పానలో టీ స్పూను నెయ్యి వేసి వేడిచేయాలి. తరువాత కోవా, కండెన్సడ్ మిల్క్ పోసి సన్నని మంట మీద కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం ముద్దకట్టాక మంట కట్టేయాలి. తరువాత మరో నానస్టిక్ పాన తీసుకుని టీ స్పూను నెయ్యి వేసి వేడిచేయాలి. ఆ తరువాత మామిడి గుజ్జు, పంచదార, యాలకుల పొడి వేసి కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం ముద్దకట్టాక కోవా మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి. చల్లారిన తరువాత పదార్థాన్ని బాగా మెదపాలి. తరువాత చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న బిళ్ళలు చేసి మధ్యలో వేలితో ఒత్తి బాదం, పిస్తా తరుముతో అలంకరించాలి.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్