బిన్ హిందికి అరుదైన గౌరవం
- August 25, 2017
మనామా: బిన్ హిందీ మోటర్స్ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. కియా మోటార్ వాహనాలకు సంబంధించి అమ్మకం అలాగే జెన్యూన్ స్పేర్ పార్ట్స్ విక్రయాలకు సంబందించి ఎక్స్‌క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్‌గా బిన్ హిందీ మోటర్స్‌కి గుర్తింపు ఉంది. ఈ సంస్థ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్‌ని మోబిస్ ద్వారా 2016 సంవత్సరానికి గాను అందుకుంది. రష్యాలోని సెంట్ పీటర్స్ బర్గ్‌లో జరిగిన మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా పార్ట్స్ కాన్ఫరెన్స్‌లో ఈ పురస్కారం సంస్థకు ప్రకటించడం జరిగింది. పార్ట్స్ మేనేజర్ ఉల్లాస్ యోహననాన్ ఈ పురస్కారాన్ని లీ, మేనేజింగ్ డైరెక్టర్ - మోబిస్ పార్ట్స్ మిడిల్ ఈస్ట్ ద్వారా అందుకున్నారు. ఈ సందర్భంగా లీ మాట్లాడుతూ, వేలాది మంది వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకోసం కియా బహ్రెయిన్ జెన్యూన్ పార్ట్స్ అమ్మకాలు సంతృప్తికరంగా సాగుతున్నట్లు చెప్పారు. బహ్రెయిన్ డిస్ట్రిబ్యూటర్ ఈ విషయంలో వినియోగదారుల మనసుల్ని గెలుచుకున్నారని చెప్పారాయన. సేఫ్ డ్రైవ్ కోసం అలాగే, వాహనాలు మెరుగైన రీతిలో మన్నిక రావడానికి జెన్యూన్ పార్ట్స్ కీలకమని ఆయన వివరించారు. కియా ఆఫ్టర్ సేల్స్ సెంటర్ జనరల్ మేనేజర్ రామ సుబ్బయ్య మాట్లాడుతూ, బిన్ హింది బహ్రెయిన్ వ్యాప్తంగా మైక్రో జెన్యూన్ పార్ట్స్ డీలర్ షిప్స్‌ని డెవలప్ చేస్తున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







