డేరా చీఫ్ గుర్మీత్‌సింగ్‌కు 10 ఏళ్ళ శిక్ష ఖరారు

- August 28, 2017 , by Maagulf
డేరా చీఫ్ గుర్మీత్‌సింగ్‌కు 10 ఏళ్ళ శిక్ష ఖరారు

ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌధా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు... శిక్ష విధించింది న్యాయస్థానం. రోహ్ తక్‌లోని కోర్టులో జరిగిన వాదనల తర్వాత ఆయనకు శిక్షలను ఖరారు చేశారు న్యాయమూర్తి. తొలుత సీబీఐ, గుర్మీత్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అయితే, అత్యాచార కేసుల్లో అత్యధికంగా విధించే శిక్షను గుర్మీత్‌కు విధించాలని సీబీఐ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే, కొన్నేళ్లుగా సామాజిక సేవ చేస్తున్న గుర్మీత్‌ను సామాజిక కోణంలో గుర్తించిన.. క్షమించాలని గుర్మీత్ తరఫు న్యాయవాదులు విజ్ఞప్తిచేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి.. తన తీర్పును చదివి వినిపించారు. పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. 

పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించాలన్న న్యాయమూర్తి ఆదేశంతో బాబా రామ్ రహీమ్ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. అంతకు ముందు కన్నీళ్లు పెట్టుకున్న బాబా.. తీర్పు విన్న తర్వాత కుప్పకూలిపోయారు. దీంతో ఆయనకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు. 

2002లో ఇద్దరు మహిళలపై రేప్ చేశారంటూ.. సెక్షన్ 164 ఆఫ్ CRPC కింద గుర్మీత్ రాం రహీమ్ సింగ్ పై  కేసు నమోదైంది. 15ఏళ్లపాటు సుదీర్ఘ విచారణ తరువాత పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు గుర్మీత్ సింగ్ ను దోషిగా నిర్దారించింది. ఆ వెంటనే పోలీసులు అతడ్ని కస్టడీలోకి తీసుకోవడంతో అరాచకం రాజ్యమేలింది. డేరా బాబా గూండాలు ఎక్కడికక్కడ పెను విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా విధ్వంసానికి పాల్పడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో.. టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ అల్లర్లలో 38మంది మృతి చెందారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. అటు సిర్సా, పంచకులలో తగలబడ్డ వాహనాలకు లెక్కే లేదు. పలువురు మీడియా ప్రతినిధులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓబీ వ్యాన్లు కూడా ధ్వంసమయ్యాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com