సాహో సినిమాకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్
- August 29, 2017
బాహుబలి చిత్రాలతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకొన్న ప్రభాస్, తన నెక్ట్స్ మూవీనీ అదే రేంజ్ లో తీయాలని ట్రై చేస్తున్నాడు. అందుకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని కూడా ఉపయోగించుకుంటున్నాడు. యాక్షన్ ఎపిసోడ్స్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న ప్రభాస్, అందుకోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే...
యంగ్ రెబల్ స్టార్ కి బాహుబలి చిత్రాలతో నేషనల్ వైడ్ ఫేమ్ వచ్చింది. దీంతో తన నెక్ట్స్ సినిమాని కూడా అన్ని బాషల్లో రిలీజ్ చేసి, తన ఇమేజ్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. అందుకోసం హీరోయిన్ దగ్గర నుంచి విలన్స్ వరకు ఎక్కువగా బాలీవుడ్ నుంచే దిగుమతి చేస్తోంది సాహో టీమ్. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ టెక్నీషియన్స్ ని రప్పిస్తోంది.
యువి క్రియేషన్స్ బ్యానర్లో రూపొందుతున్న సాహో మూవీకి సుజీత్ దర్సకుడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ నాలుగు బాషల్లో దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్, ఈ చిత్రానికి యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో నీటి అడుగున ఓ ఫైట్ ప్లాన్ చేశారట. అందుకోసం ప్రభాస్ ప్రత్యేకంగా స్కూబా డైవింగ్ నేర్చుకుంటున్నాడట..
ఆల్ రెడీ షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా, బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రద్దాకపూర్ ని ఫిక్స్ చేశారు. శ్రద్దా క్రేజ్ వల్ల హిందీలోనూ ఈ మూవీకి క్రేజ్ వస్తుంది. అలాగే బిజినెస్ కూడా బాగుంటుంది. అందుకే కాస్త రెమ్యునరేషన్ ఎక్కువే అయినా శ్రద్దా కపూర్ ని సెలక్ట్ చేశారు. అలాగే ఇందులో నెగిటివ్ రోల్స్ లోనూ, ఎక్కువగా బాలీవుడ్ స్టార్సే నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ బాషల్లో రూపొందుతున్న సాహో, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









