హార్వే తుపాను: వర్షంలో ఈత కొట్టేందుకు వెళ్లిన నిఖిల్ మృతి
- August 30, 2017
హార్వే తుపాను ధాటికి నిఖిల్ భాటియా అనే భారతీయ విద్యార్థి మృతి చెందాడు. టెక్సాస్‌లో పీహెచ్డీ చదువుతున్న నిఖిల్.. వర్షంలో ఈతకొట్టేందుకు వెళ్లి సరస్సులో మునిగి చనిపోయాడు. కాగా.. వరదల్లో చిక్కుకున్న అమెరికా ప్రజలకు అక్కడి అధికారులతో పాటు భారతసంతతి ప్రజలు కూడా ఆపన్న హస్తం అందిస్తున్నారు. అనేక భారతీయ రెస్టారెంట్లు, కుటుంబాలు వారికి ఆహారాన్ని సరఫరా చేస్తున్నాయి. పలువురు భారత సంతతి వైద్యులు ఉచితంగా సేవలు అందిస్తున్నారు.
వరదలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వేలాది సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. హ్యూస్టన్, సమీప ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు వరదలో చిక్కుకున్న 13 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. వరదలను అవకాశంగా తీసుకుని జరిగే దొంగతనాలు, నేరాలను నివారించేందుకు హ్యూస్టన్‌లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కర్ఫ్యూ విధిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







