మొరాకో చికెన్ మసాలా
- August 31, 2017కావలసిన పదార్థాలు: చికెన్ - అరకేజీ, ఉల్లిపాయలు - 2, టమోటాలు -2, పెరుగు - అరకప్పు, పసుపు - పావు టీ స్పూను, నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి - 6, వెల్లుల్లి రేకలు - 5, అల్లం ముక్క - అరంగుళం, మిరియాలు - 8, మెంతులు, జీలకర్ర, గసగసాలు - 1 టీ స్పూను చొప్పున, కొత్తిమీర - గుప్పెడు, లవంగాలు, యాలకులు - 2 చొప్పున, దాల్చినచెక్క - చిన్న ముక్క, నూనె - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం: శుభ్రం చేసిన చికెన్ ముక్కలకు నిమ్మరసం, పెరుగు, ఉప్పు, పసుపు పట్టించి పక్కనుంచాలి. ఎండుమిర్చి, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, వెల్లుల్లి, అల్లం, మిరియాలు, మెంతులు, జీలకర్ర, గసగసాలు వేగించి చల్లారిన తర్వాత పేస్టు చేసుకోవాలి. నూనెలో ఉల్లి తరుగు దోరగా వేగించి, టమోటా ముక్కలు కూడా వేసి, అవి మెత్తబడ్డాక మసాల పేస్టు కలపాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు కలిపి, రెండు నిమిషాల తర్వాత అరకప్పు నీరు పోసి మూతపెట్టి చిన్నమంటపై మగ్గించాలి. దించేముందు మరోసారి నిమ్మరసం పిండి కొత్తిమీర చల్లాలి. తందూరి, పరాటాలతో మంచి కాంబినేషన్.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్