శెనగలు తినండి హాయిగా నిద్రపోండి.. బరువు తగ్గండి..
- August 31, 2017
మాంసాహారంలో వుండే ప్రోటీన్లన్నీ శెనగలలో వున్నాయని.. వీటిని వారానికోసారి లేదు రెండుసార్లు ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతామని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శెనగల్లో పీచు ఎక్కువగా వుండటం ద్వారా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. అలాగే హృద్రోగ వ్యాధులను దూరం చేసుకోవచ్చు. రక్తహీనతకు శెనగలు భేష్‌గా పనిచేస్తాయి.
ఇందులో మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం వంటివి బీపీని నియంత్రిస్తాయి. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తాయి. దీంతో బరువు తగ్గాలనుకునే వారికి శెనగలు తోడ్పడుతాయి. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
క్యాల్షియం ద్వారా దంతాలు, ఎముకలకు బలం చేకూరుతుంది. అలాగే శెనగలతో నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. శెనగల్లో వుండే సెరొటోనిన్, అమివో యాసిడ్లు అనే పోషకాలు హాయిగా నిద్రపట్టేలా చేస్తాయి. ఇందులోని మాంగనీస్, సల్ఫర్ చర్మవ్యాధులను దూరం చేస్తుంది. కిడ్నీకి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







