బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఇండియా
- September 02, 2017
విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయ విమానాల్లో ముఖ్యంగా విద్యార్థులకు డిస్కౌంట్ రేట్లలో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఎకానమీ తరగతి టికెట్లపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది.
12నుంచి 26 సంవత్సరాల వయస్సున్న విద్యార్థులు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్ విద్యార్థులతోపాటు సైనికులు, సీనియర్ సిటిజన్స్‌కు కూడా వర్తిస్తుందని ఎయిర్ ఇండియా ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను ఎయిర్‌ఇండియా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
ఈ ఆఫర్‌లో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. విద్యార్థులు భారత్‌లో చదువుతున్న వారై ఉండాలి. రాష్ట్ర లేదా కేంద్ర విద్యాసంస్థ/యూనివర్సిటీ తరుఫున గుర్తింపు పొందిన, దానికి అనుబంధ సంస్థలో అయిన కనీసం ఒక ఏడాది పాటు ఫుల్‌టైమ్ కోర్సులో ఎన్‌రోల్ చేసుకుని ఉండాలి. అలాగైతేనే ఎయిరిండియా ఈ ఆఫర్ అందిస్తోంది.
సెప్టెంబర్ 1 నుంచి ఆ ఆఫర్ వర్తిస్తుందనీ, ప్రయాణానికి వారం రోజుల ముందు టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ఈ ఆఫర్‌ద్వారా టికెట్ బుకింగ్ ముగింపు తేదీని మాత్రం స్పష్టం చేయలేదు.
అలాగే ఈ ఆఫర్ లో 25కేజీల చెక్ ఇన్‌బ్యాగేజీ కూడా ఉచితమని తెలిపింది. ఎయిర్ ఇండియా అధికార వెబ్‌సైట్, కార్యాలయాల్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







