చికెన్ ఖాస్
- September 02, 2017కావలసినవి: ఒక కేజీ కోడి, 150 గ్రాముల వెన్న, పావుకేజీ ఉల్లిపాయలు, రెండు మూడు స్పూన్ల కారం, రెండు టేబుల్ స్పూన్ల టమోటా కెచప్, పావుకేజీ తాజా క్రీమ్, తగినంత ఉప్పు
ఎలా చేయాలి:
చికెన్‌ను పెద్ద ముక్కలుగా కోసుకుని కడిగి పెట్టుకోండి. దానిలో రెండు కప్పుల నీళ్ళు, ఉప్పు వేసి ఉడికించండి. ఉడికాక మిగిలిన నీళ్ళను పక్కన తీసి పెట్టుకోండి. కడాయిని పొయ్యి మీద పెట్టి వెన్నవేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు మొత్తం వేసి వేగించండి. సగం పక్కన పెట్టి మిగతా సగంలో చికెన్, కారం, టమోటా కెచప్ వేయండి. బ్రౌన్ రంగు వచ్చేదాకా వేగించి మిగిలిన చికెన్ నీళ్ళలో క్రీం కలిపి దానిలో వేయండి. పక్కన పెట్టిన వేగించిన ఉల్లిపాయల్ని కూరమీద చల్లండి. దీన్ని నాన్లు, పరోటాలతో కలిపి తింటే బాగుంటుంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!