బహ్రెయిన్ బే రహదారిలో భయానక కారు ప్రమాదం ఓ వ్యక్తి మృతి
- September 02, 2017
మనామా: దక్షిణ గవర్నైట్ పరిధిలో బహ్రెయిన్ బే రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటనలో మరణించిన వ్యక్తిని మహ్మద్ హబీబ్ గా ధృవీకరించారు. తన స్పోర్ట్స్ కారుని వేగంగా నడుపుతూ దానిపై నియంత్రణను కోల్పోయి హబీబ్ రోడ్డు పక్కన ఉన్న ఒక పామ్ చెట్టుని బలంగా డీ కొట్టినప్పుడు ఆ ప్రమాదం జరిగింది. సివిల్ డిఫెన్స్ అగ్నిమాపక ప్రమాదంలో సన్నివేశం చేరుకునే వరకు బాధితుడు కారు లోపల చిక్కుకున్నట్లు సమాచారం . ఈ ప్రమాదంలో క్షతగాత్రుడికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాద స్థలంలోనే ఆయన మరణించినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ సంఘటనను ధృవీకరించింది, "బహ్రెయిన్ బే రోడ్డుపై తన కారు నియంత్రణను కోల్పోయిన నేపథ్యంలో వేగంగా ప్రయాణిస్తూ మరణించాడు. తన స్వస్థలమైన, ఉత్తర గవర్నైట్లోని సదాద్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం అంతిమ సంస్కారం నిర్వహించబడింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







